AP CM YS Jagan : పల్నాడుకు కృష్ణమ్మ జలాలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
AP CM YS Jagan : పల్నాడు జిల్లా – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో బుధవారం సీఎం జగన్ పర్యటించారు, రూ. 340.26 కోట్లతో ఎత్తిపోత్తల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తొలి దశలో 24 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. 6 దశాబ్దాల తర్వాత ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి వచ్చిందని తెలిపారు సీఎం.
AP CM YS Jagan Comment about Projects
త్వరలోనే కృష్ణా జలాలు పల్నాడుకు అందుతాయని అన్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గతంలో కొలువు తీరిన పాలకులు టెంకాయలు కొట్టి మోసం చేశారంటూ ఆరోపించారు జగన్ మోహన్ రెడ్డి.(AP CM YS Jagan)ఎన్నికలు వస్తున్నాయని తెలిసి దీనికి ముహూర్తం పెట్టారంటూ ఎద్దేవా చేశారు.
అందుకే 2019లో ప్రజలు కోలుకోలేని రీతిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీలను అడ్రస్ లేకుండా చేశారంటూ మండిపడ్డారు ఏపీ సీఎం. ప్రస్తుతం అన్ని అనుమతులతో ప్రాజెక్టు చేపట్టడం జరిగిందన్నారు. నవంబర్ 6న అటవీ శాఖ నుంచి పర్మిషన్స్ వచ్చాయని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో దోచు కోవడం , దాచుకునేందుకే సరి పోయిందన్నారు.
ప్రజల పట్ల ఏ మాత్రం శ్రద్ద, ప్రేమ లేని వారికి దేవుడు శిక్ష వేశాడని అన్నారు. స్కామ్ ల పేరుతో కోట్లు కొల్లగొట్టారంటూ ఎద్దేవా చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
Also Read : Yashaswini Reddy : ఎర్రబెల్లిని తరిమి కొడతాం