CM YS Jagan : కళ్యాణమస్తు..షాదీ తోబా ప్రారంభం
ఏపీ సీఎం సంచలన నిర్ణయం
CM YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan) ప్రజా సంక్షేమమే లక్ష్యంగా దూసుకు పోతున్నారు. నూతన పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా పేదలకు లబ్ది చేకూర్చేందుకు గాను వైఎస్సార్ కళ్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను ప్రారంభించారు. ఈ రెండు సంక్షేమ పథకాలు అక్టోబర్ 1 శనివారం నుంచి అమలులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డి మాట్లాడారు. ఈ పథకాల వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. బాల్య వివాహాలు చేసుకోకుండా ఉండేందుకు, చదువు మానేయడాన్ని అరికట్టేందుకు దోహద పడుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివాహం జరిగిన 60 రోజుల లోపు పథకం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు సీఎం. మూడు నెలలకు ఒకసారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు.
ఈ పథకం పూర్తిగా విద్యతో ముడిపడి ఉందన్నారు. డ్రాప్ అవుట్ లకు చెక్ పెట్టిందని స్పష్టం చేశారు సీఎం జగన్ రెడ్డి. అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, గోరు ముద్ద, విద్యా కానుక, ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్ ఒప్పందం, నాడు నేడు బడులు, టీఎంఎఫ్, ఎస్ఎంఎఫ్, విద్యా దీవెన, వసతి దీవెన, ఉద్యోగ ఆధారిత పాఠ్యాంశాలు వంటివి విద్యను ప్రోత్సహించేందుకు గాను ఏపీ ప్రభుత్వం(CM YS Jagan) విప్లవాత్మకమైన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు సీఎం.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఇవాళ నాడు నేడు కొనసాగుతోందన్నారు జగన్ రెడ్డి. ఇదిలా ఉండగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎససార్ షాదీ తోఫా పథకాలు పొందాలంటే వధువు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికులకు ఈ పథకం సహాయం చేస్తుందన్నారు.
గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రూ. 40 వేలు, రూ. 50 వేలు ఇస్తామని ప్రకటిస్తే తాను రూ. లక్ష ఇస్తున్నామన్నారు జగన్ రెడ్డి. కులాంతర పెళ్లిళ్లు చేసుకుంటే గతంలో రూ. 75,000 వేలు ఇచ్చే వారని కానీ దానిని రూ. 1,20,000 కి పెంచామన్నారు.
Also Read : ఎస్టీ కోటాను 10 శాతం పెంచిన కేసీఆర్