AP CM YS Jagan : ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
బదిలీ నిషేధంపై ప్రభుత్వం సడలింపు
AP CM YS Jagan : ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు గత కొంత కాలంగా ఉన్న బదిలీ నిషేధంపై ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉన్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు ఏపీ సీఎం.
ఇందులో భాగంగా ప్రభుత్వ పరిధిలోని ఆయా శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. గతంలో ఉద్యోగుల బదిలీ నిషేధంపై సడలింపు ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి మే 22 నుండి 31 మధ్య ఏపీ లోని ఉద్యోగులకు సంబంధించి బదిలీలు చేపట్టేందుకు పచ్చ జెండా ఊపారు జగన్ మోహన్ రెడ్డి.
అభ్యర్థన, పరిపాలనా గ్రౌండ్స్ లో బదిలీలకు అవకాశం ఉందని సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టమైన విధి విధానాలను (గైడ్ లైన్స్ ) ను విడుదల చేసింది. 2 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి అభ్యర్థనపై బదిలీ చేసేందుకు అవకాశం ఉంది. అంతే కాకుండా ఒకే చోట 5 ఏళ్లు పూర్తి చేసిన వారికి అభ్యర్థన చేసుకుంటే ఆ ప్రాతిపదికన బదిలీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్లు బదిలీ చేసుకునేందుకు అర్హులు కానున్నారని ప్రభుత్వం విధి విధానాలలో పేర్కొంది.
Also Read : Chandrababu Naidu