Amul Chittoor Dairy : చిత్తూరు డెయిరీ పునరుద్దరణ
గత సర్కార్ హయాంలో మూత
Amul Chittoor Dairy : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చారు సీఎం. చంద్రబాబు హయాంలో నిర్లక్ష్యానికి గురైన చిత్తూరు డెయిరీకి మోక్షం కల్పించేందుకు కృషి చేశారు. జగనన్న పాల వెల్లువ పథకంలో మరో విప్లవాత్మక అడుగుకు శ్రీకారం చుట్టారు జగన్ రెడ్డి.
చిత్తూరు డెయిరీ(Chittoor Amul Dairy) సంస్థపై రూ. 182 కోట్ల అప్పులు పేరుకు పోయాయి. మొత్తం అప్పులను తీర్చేసింది ఏపీ సర్కార్. దానికి మరలా జీవం పోశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అముల్ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నించారు. రూ. 385 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు. రాబోయే 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే దిశగా ప్లాన్ చేశారు. ఇక చిత్తూరు డెయిరీ పునరుద్దరణలో భాగంగా తొలి దశలో రూ. 150 కోట్ల ఖర్చుతో దేశంలోని అతి పెద్ద ఐస్ క్రీమ్ ప్లాంటు నిర్మాణం చేపడతారు.
ఇక దశల వారీగా పాల కర్మాగారం, బటర్ తయారీ విభాగం, పాల పొడి తయారీ , యుహెచ్ టీ , చీజ్ తయారీ, పన్నీర్, యోగర్ట్ , స్వీట్ల తయారీ విభాగాలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి , అమూల్ ఔట్ లెట్లు, పంపీణీ యంత్రాంగంతో కలుపుకుని పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి , 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ది చేకూరనుంది.
Also Read : Pothula Sunitha : తండ్రీ కొడుకులవి నీచ రాజకీయాలు