AP CM YS Jagan : రెండో విడత రైతు భరోసా విడుదల
నంద్యాల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
AP CM YS Jagan : ఏపీలో రైతులకు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా(Rythu Bharosa) విడుదల చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సోమవారం ఏపీలోని నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలోని 50.92 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు గాను వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద రూ. 2096 కోట్లు సహాయం చేశారు.
లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మొదటి విడతగా రాష్ట్రంలో రైతులకు 7,500 రూపాయలు, ఈ ఏడాదిలో మేలో ఒక్కో రైతుకు రూ. 13,500 అందజేశామని చెప్పారు.
ఇవాళ విడుదల చేసిన రెండో విడతలో జమ చేసిన వాటితో ఖరీఫ్ పంటలు, రబీ విత్తనాలకు సంబంధించి ఒక్కో రైతుకు రూ. 4,000 అందుతాయని చెప్పారు ఏపీ సీఎం. వచ్చే జనవరిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒక్కొక్కరికి రూ. 2,000 చివరి విడత అమలు చేస్తామని ప్రకటించారు.
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 50 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరిందని అన్నారు. ప్రతి ఏటా ఈ స్కీం కింద రూ. 7,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు సందింటి జగన్ మోహన్ రెడ్డి.
ఇప్పటి దాకా రైతు భరోసా కేంద్రాలు, ఉచిత పంట బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, ఉచిత తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా, యాంత్రీకరణ , కనీస మద్దతు ధర వంటి వివిధ పథకాల కింద రూ. 1,33,526.92 కోట్లు ఖర్చు చేశామన్నారు.
Also Read : టీఆర్ఎస్ ఎంపీ నామా ఆస్తులు జప్తు