AP CM YS Jagan : అంతటా అప్రమత్తంగా ఉండండి – జగన్
ఏపీలో సహాయక చర్యలపై సమీక్ష
AP CM YS Jagan : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారింది. దీని కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. కుండ పోత వర్షాల ధాటికి వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండి పోయాయి. పలు చోట్ల రహదారులపైకి నీరు వచ్చి చేరింది. ఇదే సమయంలో ధవళేశ్వరం , ప్రకాశం బ్యారేజ్ కు వరద నీరు పెరిగింది. కృష్ణా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది.
AP CM YS Jagan Instructs
దీంతో శుక్రవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) తాడేపల్లి గూడెంలోని సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన జిల్లాలలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందజేయాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాస కార్యక్రమాలపై ఏపీలోని జిల్లాల కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వర్షాలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దంటూ కోరారు.
ఈ సమీక్ష సమావేశంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తావేటి వనిత, స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Also Read : RK Roja Pawan : పవన్ బాధిత మహిళల లెక్కలు తేల్చండి