AP CM YS Jagan : ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
AP CM YS Jagan : ప్రజా సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై రివ్యూ చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర సర్కార్ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. ఇవాళ తాము చేపట్టిన నాడు నేడు , ఆర్బీకే సెంటర్ ల ఏర్పాటు దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలిచాయని పేర్కొన్నారు.
వాలంటీర్లు ప్రభుత్వానికి గుండె కాయ లాంటి వారన్నారు. వారు లేక పోతే సర్కార్ నడవదని తెలిపారు. వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). కొందరు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని, వారికి అభివృద్దిని ఎలా అడ్డుకోవాలనే ధ్యాస తప్ప విజన్ తో ముందుకు వెళ్లాలన్న చిత్త శుద్ది లేదన్నారు.
ప్రతి పథకం పేదలు, సామాన్యాలు, మధ్య తరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల వారికి కులం, మతం అన్న ప్రాతిపదికన లేకుండానే చేరవేస్తున్నామని చెప్పారు. ఇంకా ఎవరైనా రాని వారుంటే వారందరినీ గుర్తించి లబ్ది పొందేలా చూడాలని ఆదేశించారు సీఎం జగన్ రెడ్డి.
Also Read : ED Chief Supreme Comment : మారని కేంద్రం ‘సుప్రీం’ ఆగ్రహం
