AP CM YS Jagan : విద్యతోనే వికాసం అభివృద్ది
ఏపీ సీఎం వైఎస్ జగన్
AP CM YS Jagan : ప్రతి ఒక్కరు చదువుపై ఫోకస్ పెట్టాలి. అదే మనల్ని మారుస్తుందన్నారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించారు. ఒకప్పుడు పెత్తదారుల చేతుల్లో బందీ అయిన విద్యను పేదవాళ్ల హక్కుగా మార్చానని స్పష్టం చేశారు సీఎం.
AP CM YS Jagan Speech
నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు వైఎస్ జగన్ రెడ్డి(AP CM YS Jagan). ఆటో డ్రైవర్ కొడుకు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ , మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ , వ్యవసాయ కూలీ కొడుకు వ్యవసాయ శాస్త్రవేత్తగా , కాంపౌండర్ కూతురు కూడా ఇవాళ డాక్టర్ కోర్సులు చదువుతున్నారని తెలిపారు.
విద్యతోనే అన్నీ సాధ్యమవుతాయని స్పష్టం చేశారు వైఎస్ జగన్ రెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో విద్యార్థులు చదువుకు , ఆర్థిక సాయానికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక పూర్తిగా మార్పు చేయడం జరిగిందన్నారు.
ఫీజు రీఇండర్స్ మెంట్ కూడా ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించానని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే సాధ్యమవుతుందని అన్నారు వైఎస్ జగన్ రెడ్డి.
Also Read : Marri Janardhan Reddy : నేను తల్చుకుంటే కాల్చి పారేస్తా – మర్రి