AP CM YS Jagan : మేరా భారత్ మహాన్ – జగన్
జాతీయ జెండాకు సీఎం వందనం
AP CM YS Jagan : 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలకు సీఎం జగన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు కర్నూల్ జిల్లా లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు జిల్లా ఇంఛార్జ్ మంత్రి బుగ్గున రాజేంద్ర నాథ్ రెడ్డి, రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత జాతీయ జెండాను ఆవిష్కరించారు.
AP CM YS Jagan Words About 77 Independence Day
ఈ సందర్బంగా నేషనల్ ఫ్లాగ్ ను ఆవిష్కరించిన అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) ప్రసంగించారు. స్వాతంత్ర ఉద్యమంలో సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వారు చేసిన బలిదానాలు, త్యాగాల వల్లనే దేశానికి స్వతంత్రం లభించిందన్నారు జగన్ రెడ్డి.
గత నాలుగు ఏళ్లలో తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు సీఎం. పారదర్శక పరిపాలనా వ్యవస్థ, ప్రజా సంక్షేమం, శాశ్వత అభివృద్దిపై తాము ఫోకస్ పెట్టామన్నారు జగన్ రెడ్డి.
విద్యా రంగంలో కీలకమైన మార్పులు తీసుకు వచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మౌలిక వసతులను కల్పించడం జరిగిందని చెప్పారు జగన్ రెడ్డి. ఇవాళ దేశానికే ఏపీ రాష్ట్రం ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు. ఇందు కోసం కష్ట పడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు జగన్ మోహన్ రెడ్డి.
Also Read : AP CM YS Jagan : ప్రపంచంతో మనం పోటీ పడాలి