AP CM YS Jagan : భూ సంస్కరణలపై ప్రచారం చేయాలి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
AP CM YS Jagan : ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ సంస్కరణలకు సంబంధించి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జగనన్న శాశ్వత భూ హక్కు , భూ రక్ష పై సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు.
AP CM YS Jagan Start Land Reform
రెవిన్యూ విభాగంలో విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు, సమగ్ర భూ సర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో తీసుకున్న చర్యలు , వాటి కారణంగా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై సమాచారాన్ని ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు ఏపీ సీఎం.
ప్రజలకు మేలు చేస్తున్నప్పటికీ ఎల్లో మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని దీనిని గమనించి విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). ప్రజలకు వ్యతిరేకంగా తప్పుడు రాతలు రాస్తోందన్నారు. వాటిని తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు .
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్లు ఉన్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకు వచ్చేలా చేస్తున్నామని ఇంతకంటే ఇంకేం కావాలన్నారు.
Also Read : Daggubati Purandeswari : బీజేపీ నా మట్టి నా దేశం