AP CM YS Jagan : బాబు..ప‌వ‌న్ ఇద్ద‌రూ ఒక్క‌టే – జ‌గ‌న్

ఏపీని స‌ర్వ నాశ‌నం చేసిన మాజీ సీఎం

AP CM YS Jagan : ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. ఇద్ద‌రూ ఒక్క‌టేనంటూ ఆరోపించారు. ఒక‌రు వెన్నుపోటు దారుడైతే మ‌రొక‌రు ప్యాకేజ్ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. మంగ‌ళవారం చిత్తూరు డెయిరీని పున‌రుద్ద‌రించారు. దీనిని అమూల్ సంస్థ‌కు అప్ప‌గించారు. 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. ప్ర‌తి ఏటా కోటి చెల్లించేలా ఒప్పందం చేసుకుంది ఏపీ స‌ర్కార్. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వేలాది మందికి ఉపాధి క‌ల్పిస్తోంద‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి.

చంద్ర‌బాబు నాయుడు వ‌య‌స్సు 75 ఏళ్లు. ఆయ‌న‌కు ఇప్పుడు పాలిటిక్స్ తో ప‌నేంటి అంటూ ప్ర‌శ్నించారు . ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాలుగు పెళ్లిళ్ల వీరుడంటూ మండిప‌డ్డారు. వీళ్లా త‌న‌కు నీతులు చెప్పేది అంటూ నిప్పులు చెరిగారు. ఎవ‌రు ఏమిటో, వాళ్ల స్థాయి ఏమిటో ప్ర‌జ‌ల‌కు తెలుసన్నారు. ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్ ముగిసిందంటూ చంద్ర‌బాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan).

35 ఏళ్ల త‌ర్వాత కుప్పంలో ఇల్లు క‌ట్టుకుంటార‌ని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. ఇంత కాలం ఏం చేశారంటూ ప్ర‌శ్నించారు. ఏపీ సీఎంగా చిత్తూరు జిల్లాకు ఏం చేశారో చెప్పాల‌ని అన్నారు సీఎం. ప‌ప్పు బెల్లానికి చంద్ర‌బాబు రాష్ట్ర వ్యాప్త డెయిరీని అమ్మేశారంటూ ఆరోపించారు. అమ్మింది కూడా నామా నాగేశ్వ‌ర్ రావుకు, దేవేంద‌ర్ గౌడ్ కు అని ఎద్దేవా చేశారు.

Also Read : Jithender Reddy : రేవంత్ ఫోన్ జితేంద‌ర్ రెడ్డి ఖుష్

 

Leave A Reply

Your Email Id will not be published!