AP CM YS Jagan : బుద్ది లేనోడు బాబు సిగ్గు లేనోడు లోకేష్
ఏపీ సీఎం సంచలన కామెంట్స్
AP CM YS Jagan : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ప్రతిపక్ష నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానంగా మాజీ సీఎం , టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు, బావమరిది , నటుడు నందమూరి బాలకృష్ణలను టార్గెట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వ్యక్తిగత ఆరోపణలతో హోరెత్తించారు.
AP CM YS Jagan Words
శుక్రవారం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. యువ గళం పాదయాత్ర చేపట్టిన లోకేష్ బాబుకు సిగ్గు లేదన్నారు. మందు తాగుతూ, స్విమ్మింగ్ పూల్ లో ఈదుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉంటాడని ఎద్దేవా చేశారు. ఇతగాడు ఏపీ ప్రజలను ఎలా కాపాడుతాడంటూ ప్రశ్నించారు జగన్ రెడ్డి(CM YS Jagan).
ఇక నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయి (హీరోయిన్ ) కనిపిస్తే చాలు ముద్దు అయినా పెట్టాలి లేదంటే కడుపైనా చేయాలని అనుకుంటాడంటూ ఎద్దవేఆ చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
చంద్రబాబు నాయుడికి 70 ఏళ్లు వచ్చినా ఇంకా చిలిపి చేష్టలు పోలేదన్నారు. బావా నువ్వు సినిమాల్లో చేశావు..కానీ నేను నిజ జీవితంలో చేశానంటూ ఆరోపించారు .
Also Read : Kishan Reddy Sworn : బీజేపీ చీఫ్ గా కొలువు తీరిన కిషన్ రెడ్డి