YS Jagan : రంగారెడ్డి జిల్లా ముచ్చంతల్ లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి మహోత్సవాలలో పాల్గొనేందుకు ఇవాళ ఏపీ సీఎం జగన్ రెడ్డి (YS Jagan)రానున్నారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం రూ. 1000 కోట్లతో ఏర్పాటు చేసిన 216 అడుగుల శ్రీ రామానుజుడు సమతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకుంటారు.
సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఈనెల 2న ప్రారంభమయ్యాయి. 14 వరకు కొనసాగుతాయి. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
నిన్న పవర్ స్టార్ , జనసేసన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయన చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక ఉత్సవాలకు సంబంధించి ఇవాళ ఆరో రోజు.. మొదటగా దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టి యాగం చేపడతారు.
ఇందులో భాగంగా వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ చేస్తారు. వీటితో పాటు ప్రముఖలతో ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు.
ఇక చిన్న జీయర్ స్వామి యాగశాల నుంచి రుత్విక్కులతో కలిసి ర్యాలీగా వచ్చి సమతామూర్తి ప్రాంగణంలో ఉనన దివ్య దేశాలకు ప్రాణ ప్రతిష్ట చేపడతారు.
ఇవాళ ఏపీ సీఎం రాగా రేపు కేంద్ర మంత్రి అమిత్ షా, 9న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ , 10న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరవుతారు. 12న ఉప రాష్టపతి వెంకయ్య నాయుడు, 13న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతామూర్తిని సందర్శిస్తారు.
Also Read : రామానుజం అంబేద్కరిజం ఒక్కటే