AP CM YS Jagan : న్యూఢిల్లీ – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు వైసీపీ ఎంపీలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కీలక అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పనుల ప్రగతికి సంబంధించి నిధుల మంజూరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు ఈ టూర్ లో జగన్ రెడ్డి.
AP CM YS Jagan Delhi Tour
ఇక పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
మరో వైపు ఏపీ స్కిల్ స్కాం కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంకా రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇవాళ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఓ వైపు జగన్(AP CM YS Jagan) ను జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ , టీడీపీ కలిసి సంయుక్తంగా ఎదుర్కొనేందుకు పావులు కదుపుతున్నారు. మరో వైపు కేంద్రంలో బీజేపీ మద్దతు లేకుండా జగన్ చంద్రబాబును అరెస్ట్ చేసే ప్రసక్తి లేదన్న ప్రచారం జరుగుతోంది.
Also Read : CEC Rajiv Kumar : ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలి
