AP CM YS Jagan Tour : 5న జగన్ హస్తిన టూర్
పీఎం మోదీ, షాతో భేటీ
AP CM YS Jagan Tour : ఆంధ్ర ప్రదేశ్ – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈనెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్బంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను కలవనున్నారు. సీఎం పర్యటన రెండు రోజుల పాటు ఉంటుందని సమాచారం.
ఇప్పటికే ఏపీలో పాలిటిక్స్ మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి . మరో వైపు 45 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును జైలులో వేశారు. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్.
AP CM YS Jagan Tour to Delhi
మొత్తంగా జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) ఏమై ఉంటుందని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో వైపు త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీకి రావాల్సిన నిధుల గురించి, బకాయిల మంజూరు గురించి ప్రత్యేకంగా ఏపీ సీఎం ప్రధాన మంత్రితో చర్చించనున్నారు.
ఇప్పటికే పార్లమెంటరీ పార్టీ చీఫ్ విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో పలుమార్లు కేంద్ర మంత్రులను కలుస్తూ వస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరో వైపు త్వరలోనే పాలనా పరంగా విశాఖను కేంద్రంగా చేసుకుని ముందుకు సాగుతామని జగన్ రెడ్డి ప్రకటించారు.
Also Read : AP High Court : ఏపీ సీఐడీ విచారణ 10కి వాయిదా