AP CM YS Jagan : పేద‌ల సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

AP CM YS Jagan : పేద‌ల సంక్షేమ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. గురువారం తాడేప‌ల్లి గూడెం లోని క్యాంపు కార్యాల‌యంలో గృహ నిర్మాణ శాఖపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ స‌మీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ , ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ చైర్మ‌న్ ద‌వులూరి దొర‌బాబు, టిడ్కో చైర్మ‌న్ ప్ర‌స‌న్న కుమార్ , పుర‌పాలిక‌, ప‌ట్ట‌ణ అభివృద్ది శాఖ స్పెష‌ల్ సీఎస్ శ్రీ‌లక్ష్మి, అజ‌య్ జైన్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టించాలని కంక‌ణం క‌ట్టుకుంద‌న్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు సీఎం. ఎక్క‌డా అల‌స‌త్వం లేకుండా ల‌బ్దిదారుల‌కు ఇళ్ల ప‌ట్టాలు అంద‌జేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

టిడ్కో ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఇళ్ల‌కు ఎక్కడా లేనంత‌గా ప్ర‌యారిటీ ఇస్తున్నామ‌ని చెప్పారు. దేశంలోనే ఏపీ ఇళ్ల నిర్మాణం ఆద‌ర్శ ప్రాయంగా మారాల‌న్న‌దే త‌న ముందున్న అతి పెద్ద ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. పూర్తి నాణ్య‌వంతంగా ఉండేలా చూడాల‌ని ఎక్క‌డా ఏ ఒక్క విమ‌ర్శ‌ను తాను త‌ట్టుకోలేన‌న్నారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీ మేర‌కు ఇళ్ల‌ను పూర్తి చేసి రికార్డు సృష్టించాల‌న్నారు.

Also Read : Babu Jagjivan Ram : పేద‌ల బాంధ‌వుడు బాబూజీ

Leave A Reply

Your Email Id will not be published!