AP CMO GO : అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఒక్కసారి చెబితే ఇక వెనక్కి తీసుకునే ప్రసక్తి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మొండి ఘటం. గత కొన్ని రోజుల నుంచి ఏపీ రాష్ట్ర రాజధానిని విశాఖ పట్నంకు మారుస్తానని ప్రకటిస్తూ వచ్చారు.
AP CMO GO Issued
కానీ జనం నమ్మలేదు. గతంలో మూడు రాజధానులు చేస్తానని తెలిపారు. తాజాగా కీలక ప్రకటన చేశారు జగన్ . విశాఖ పట్టణానికి రాష్ట్ర రాజధానిని మారుస్తున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాయలంను విశాఖకు మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారికంగా 2015 జీవోను జారీ చేసింది. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో సీఎంఓ(AP CMO) ఆఫీసు ఉండేది. ఇక నుంచి సీఎంవో విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందులో సిఎంవో మార్పు, మౌలిక సదుపాయాల కల్పన, మంత్రుల నివాసాల కోసం ఏకంగా కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో తీసుకు వచ్చారు.
ఇందులో భాగంగా ఆర్థిక, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సామరస్యక పూర్వక, సమతుల్యతతో కూడిన వృద్ది కోసం మార్చుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని వల్ల మరింత డిమాండ్ పెరగనుంది విశాఖకు.
Also Read : Pawan Kalyan : పవన్ కామెంట్స్ పై కోర్టు విచారణ