PV Sunil Kumar Jagan : సీఎంతో డీజీ సునీల్ కుమార్ భేటీ
రెస్యూ ఆపరేషన్స్ పై చర్చ
PV Sunil Kumar Jagan : ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, అగ్ని మాపక , డిజాస్టర్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ ఐజీ పీవీ సునీల్ కుమార్ మంగళవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. విపత్తు ఉపశమనం, రెస్క్యూ మెకానిజంలను మెరుగు పర్చేందుకు ఒడిస్సాలో పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడ చూసి, తెలుసుకున్న అనుభవాలను జగన్ రెడ్డితో పంచుకున్నారు.
ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవలకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు సీఎం. ఈ విషయాన్ని స్వయంగా శాఖకు బాధ్యత వహిస్తున్న ఐజీ పీవీ సునీల్ కుమార్(PV Sunil Kumar) ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
కాగా పీవీ సునీల్ కుమార్ వృత్తి రీత్యా ఐపీఎస్ ఆఫీసర్ అయిన్పటికీ ఆయన చేయి తిరిగిన రచయిత. అంతే కాదు ప్రజా సేవకుడిగా పేరు పొందారు. సమాజంలో పెను మార్పులు తీసుకు వచ్చేలా కృషి చేశారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో పుట్టారు. అట్టడుగు వర్గాల వారి బాగు పడేలా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.
శ్రీకాకుళం , మెదక్ జిల్లాలో ఎస్పీగా , ఈస్ట్ జోన్ హైదరాబాద్ సిటీ పోలీస్ లో డిప్యూటీ కమిషనర్ గా , ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషణ్ లో ఎండీగా ని చేశారు. ఇక రచనా పరంగా మూడు నవలలు, చిన్న కథలు రాశారు. పదునైన వ్యంగ్యానికి, హాస్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు పీవీ సునీల్ కుమార్.
Also Read : Sanjay Raut KCR : కేసీఆర్ పై సంజయ్ రౌత్ కన్నెర్ర
