AP DIG Ravi Kiran : చంద్రబాబు ఆరోగ్యం పదిలం
ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ కామెంట్స్
AP DIG Ravi Kiran : అమరావతి – ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై వస్తున్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు డీజీపీ మీడియాతో మాట్లాడారు.
AP DIG Ravi Kiran Comment About Chandrababu Health
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) చేసిన ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఎప్పటికప్పుడు చంద్రబాబు ఆరోగ్యంపై ఫోకస్ పెట్టామన్నారు.
రాజమండ్రి జైలులో ప్రస్తుతం 2,300 మంది ఖైదీలు ఉన్నారని, మాజీ సీఎం కావడంతో ఒకింత ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని తెలిపారు. ఆయనకు చర్మ వ్యాధి ఉందని మందులు ఎప్పటికప్పుడు ఇస్తున్నట్లు చెప్పారు డీఐజీ. భద్రత విషయంలో చంద్రబాబుకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు డీఐజీ రవి కిరణ్.
ప్రతి రోజూ మూడు సార్లు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించినప్పుడు ఆయన బరువు 66 కేజీలని ఇప్పుడు 67 కేజీలకు పెరిగారని చెప్పారు . విమర్శలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు .
Also Read : Nara Lokesh : బాబును చంపేందుకు కుట్ర