AP Nadu Nedu : నవ నాయకుడు, డైనమిక్ లీడర గా పేరొందిన ఏపీ సీఎం సందింటి జగన్ రెడ్డి ఏది చేసినా సంచలనమే. ఆయన ముందు చూపు కలిగిన నాయకుడిగా ఇప్పటికే గుర్తింపు పొందారు.
అప్పులు చేసైనా సరే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుండాలని కలలు కన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మహిళా సాధికారత, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ విస్తరణపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లకు చెక్ పెట్టారు. ఆయన ప్రవేశ పెట్టిన నాడు నేడు కార్యక్రమం ఇవాళ దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తోంది.
నిన్నటి దాకా తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ ఆఫీసర్ గా ఉన్న ఆకునూరి మురళిని పట్టించుకోని ప్రభుత్వం ఏపీ సర్కార్ సాదర స్వాగతం పలికింది.
ఆయన తోడ్పాటుతో ఇవాళ నాడు నేడు(AP Nadu Nedu )టాప్ పథకంగా కొనియాడబడుతోంది. ఈ స్కీంను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టడం విశేషం.
ఏది ఏమైనా పాలకులు అన్న తర్వాత ఎవరు పనిమంతులనే విషయం గుర్తుంచు కోవాలి. వీరిని వాడు కోవడంలో జగన్ టాప్ లో ఉన్నారు. వారి సేవలను సమాజాభివృద్దికి ఉప యోగ పడేలా చేస్తున్నారు.
ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కేవలం 33 నెలల్లో విద్యా రంగానికి రూ. 90 వేల కోట్లు కేటాయించామన్నారు. యావత్ భారత మంతా ఏపీ వైపు చూస్తోందన్నారు మంత్రి.
నాడు నేడులో ఇప్పటి దాకా రూ. 3 వేల 669 కోట్లతో స్కూళ్లను ఆధునీకరించినట్లు చెప్పారు అసెంబ్లీలో. గోరు ముద్ద కింద రూ. 1,600 కోట్లు, విద్యా కానుక కింద రూ. 1, 437 . 31 కోట్లు, రూ. 444.89 కోట్లతో మరుగుదొడ్లు నిర్మించామని చెప్పారు.
Also Read : పైరవీలు వద్దు ప్రతిభ ముద్దు