AP Governor Serious : జ‌డ్జీల‌పై ట్రోలింగ్స్ స‌ర్కార్ సీరియ‌స్

టీడీపీ నేత‌లు, ఇత‌రుల‌పై కేసులు

AP Governor Serious : ఆంధ్ర‌ప్ర‌దేశ్ – ఏపీ స్కిల్ స్కాంలో అడ్డంగా బుక్కై రిమాండ్ ఖైదీగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు, హైకోర్టు దాఖ‌లైన పిటిష‌న్ల‌పై కోర్టు విచార‌ణ‌లు జరిగాయి. ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. హైకోర్టు బెయిల్ పిటిష‌న్ కొట్టివేసింది.

AP Governor Serious Comment

దీంతో చంద్ర‌బాబు నాయుడును కావాల‌ని ఇరికించారంటూ, ఏపీ స‌ర్కార్ ఒత్తిళ్ల మేర‌కు కోర్టులు బాబుకు వ్య‌తిరేకంగా తీర్పులు వ‌చ్చేలా చేశాయంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది.

ప్ర‌త్యేకించి జ‌డ్జీల‌పై ట్రోలింగ్స్ పెరిగి పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. అరెస్ట్ త‌ర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జ‌డ్జీల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న వారిపై ప్ర‌భుత్వం తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసింది. అస‌భ్య‌క‌రంగా దూషిస్తున్నారంటూ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ శ్రీ‌రామ్ ఫిర్యాదు చేశారు.

ఈ విష‌యం గురించి ఏజీ ఏపీ గ‌వ‌ర్న‌ర్(AP Governor) కు తెలిపారు. దీంతో వెంట‌నే స్పందించారు . వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించారు. ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్క‌ర‌ణ కింద క్రిమిన‌ల్ కాంటెంప్ట్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన ఏజీ.

Also Read : Nara Lokesh : లోకేష్ అరెస్ట్ కు రంగం సిద్దం..?

Leave A Reply

Your Email Id will not be published!