AP Govt Announce : ఏపీలో 25 వరకు దసరా సెలవులు
ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం
AP Govt Announce : ఆంధ్ర ప్రదేశ్ – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెలలో దసరా పండుగ రానుండడంతో తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటికీ అక్టోబర్ 25 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
AP Govt Announce for Dussehra
ఈ మేరకు దసరా(Dussehra) సెలవులు ఖరారు చేయడంతో అంతా ఆనందంలో ఉన్నారు. కాగా అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు సెలవులు ఉంటాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇక అక్టోబర్ 26 వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది ఏపీ ప్రాథమిక, ఉన్నత విద్యా శాఖ.
ఇరు తెలుగు రాష్ట్రాలలో దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణలో ఎక్కువగా కొలువు తీరారు ఆంధ్రావాసులు. దీంతో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు భారీ ఎత్తున బస్సులను ఏర్పాటు చేశాయి.
ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, పేరెంట్స్ ప్రయాణంలో మునిగి పోయారు. ఇటు రైళ్లు, అటు బస్సులు క్రిక్కిరిసి పోయాయి.
Also Read : Ganta Srinivasa Rao : జగన్ రెడ్డిపై గంటా కన్నెర్ర