AP Govt Announced : కొత్త మండలాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ఏర్పాటు కానున్న ఆరు మండలాలు
AP Govt Announced : సందింటి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా 6 మండలాలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు పచ్చ జెండా(AP Govt Announced) ఊపింది. సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎం సారథ్యంలోని మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అయ్యింది. ఇందులో భాగంగా కొత్త మండలాల ఏర్పాటుకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రాథమికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాలు ఉన్నాయి. వాటిలో విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలను ఎంపిక చేసింది మంత్రివర్గం. వీటికి సంబంధించి గ్రామీణ, పట్టణ మండలాలుగా విభజించింది. వీటితో పాటు మచిలీపట్నంను దక్షిణ, ఉత్తర మండలాలుగా విభజించనున్నట్లు జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని వార్డులతో పాటు శివారు గ్రామాలను కూడా ఇందులో చేర్చనుంది. వీటిని కలిపి మండలాలుగా ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదం(AP Govt Announced) తెలిపింది. ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం కోరింది. ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేయాలని సూచించింది ఏపీ సర్కార్. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే మండలాలుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం.
Also Read : ఐసెట్ 2023 నోటిఫికేషన్ రిలీజ్