Sarkaru Vaari Paata : మహేష్ మూవీకి గుడ్ న్యూస్
ఏపీ ప్రభుత్వం తీపి కబురు
Sarkaru Vaari Paata : పరుశురామ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కలిసి నటించిన సర్కార్ వారి పాట మూవీ ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ ఏర్పాట్లలో మునిగి పోయారు.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ దుమ్ము రేపుతున్నాయి. ప్రధానంగా ట్రైలర్ షాక్ కు గురి చేస్తోంది. ఇక పాటలన్నీ ఇప్పటికే జనాదరణ పొందాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
ఇప్పటికే యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ మూవీని(Sarkaru Vaari Paata) నిర్మించారు మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ . ఇప్పటి వరకు జక్కన తీసిన ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ -2 మూవీకి ఏపీ సర్కార్ టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది.
తాజాగా సర్కార్ వారి పాట చిత్రానికి సంబంధించి టికెట్ల రేటుపై రూ. 45 అదనంగా వసూళ్లు చేసుకునేందుకు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. 10 రోజుల తర్వాత యధావిధిగా మళ్లీ పాత ధరలే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఈ మేరకు సర్కార్ వారి పాట నిర్మాతలు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇక పరుశురామ్ టేకింగ్ , ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం ఇప్పటికే జనాన్ని సమ్మోహితులను చేస్తోంది.
చిత్రానికి(Sarkaru Vaari Paata) సంబంధించి నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ , రామ్ అచంట , గోపిచంద్ అచంట సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాలు నెలకొన్నాయి సినిమాపై.
రామ్ , లక్ష్మణ్ మాస్టర్ల ఫైట్స్ , శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ సర్కార్ వారి పాటకు హైలెట్ గా నిలిచింది.
Also Read : సర్కార్ వారి పాట బ్లాక్ బస్టర్ ఖాయం