AP Govt Hike Land Rates : ఏపీలో కొండెక్కిన భూముల ధ‌ర‌లు

ప్ర‌జ‌ల‌కు ఏపీ స‌ర్కార్ బిగ్ షాక్

AP Govt Hike Land Rates : రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని అనుకుంటున్న ఏపీ స‌ర్కార్ ఉన్న‌ట్టుండి పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు భూముల కొనుగోలుదారుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అమాంతం పెంచేసింది. దీంతో ల‌బోదిబోమంటున్నారు జ‌నం. ఈ నెల ప్రారంభం నుంచే బాదుడు షురూ చేసింది. ఇక కొత్త‌గా భూములు కొనుగోలు చేయాల‌ని అనుకునే వారి ఆశ‌ల‌పై నీళ్లు చల్లింది.

భారీగా రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు వడ్డించింది. ఏకంగా 29 శాతం నుంచి 31 శాతం ధ‌ర పెంచింది. ఒక్కో ఏరియాలో ఒక్కో రేటు ప‌లుకుతున్నా ప్ర‌భుత్వం మాత్రం భారీగా ధ‌ర‌లు పెంచి ఖ‌జానా నింపే ప్ర‌యత్నానికి శ్రీ‌కారం చుట్టింది. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌తో పాటు గ్రామీణ ప్రాంతాల‌కు కూడా ఈ ధ‌రా భారం పాకింది.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ దీనికి ఆజ్యం పోస్తే ప్ర‌స్తుతం ఏపీ స‌ర్కార్ అద‌న‌పు బ‌రువు మోపింది. ఉన్న వాళ్లకు ఏమో కానీ క‌నీసం పొలం ఉండాల‌న్న ఆశ‌తో ఉన్న వారికి మాత్రం ఇది చేదు వార్తేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జూన్ 1 నుంచే నూత‌న రేట్లు అమ‌లులోకి రానున్నాయి. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఏపీ స‌ర్కార్ . ఈ మేర‌కు అధికారికంగా ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది.

రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు భారీగా వ‌డ్డిస్తుండ‌డంతో భూముల ధ‌ర‌లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి(AP Govt Hike Land Rates). ఇప్ప‌టికే భూముల ధ‌ర‌ల పెంపు విష‌యంపై క్లారిటీ ఇచ్చేశారు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు. ఇక హైవేలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో భారీగా భూముల ధ‌ర‌లు పెరిగే ఛాన్స్ ఉంది. ఏపీలో 2020న భూముల ధ‌ర‌లు పెంచారు. ప్ర‌స్తుతం దీనికి శ్రీ‌కారం చుట్టారు ఏపీ సీఎం జ‌గ‌న్.

Also Read : Tirumala Crowds

 

Leave A Reply

Your Email Id will not be published!