Chandrababu Naidu : చంద్రబాబుకు హైకోర్టు బిగ్ షాక్
క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
Chandrababu Naidu : విజయవాడ – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే తనను గృహ నిర్బంధంలో ఉంచాలని, వయసు పెరిగిన దృష్ట్యా ఛాన్స్ ఇవ్వాలంటూ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇందుకు ఏసీబీ కోర్టు జడ్జి బీఎస్వీ హిమ బిందు ఒప్పుకోలేదు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు.
Chandrababu Naidu Case Viral
చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు ఏసీబీ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు స్కిల్ స్కాం కేసు, ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ ను కొట్టి వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కు సంబంధించి బుధవారం హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.
కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆశలపై నీళ్లు చల్లింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో అప్పటి దాకా బాబు రాజమండ్రి జైలులోనే ఊచలు లెక్క బెట్టాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా జైలర్ చంద్రబాబు నాయుడుకు ఖైదీ నెంబర్ ను కూడా కేటాయించారు.
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకు ప్రమేయం ఉందంటూ ఏపీ సీఐడీ ఆరోపించింది. రూ. 371 కోట్లు హవాలా రూపంలో ముట్టాయని ఆరోపించింది. దీంతో రిమాండ్ విధించింది జడ్జి.
Also Read : Bhuvaneshwari : కుట్ర నిజం అరెస్ట్ అక్రమం