AP High Court : పుంగనూరు అల్లర్ల కేసుపై తీర్పు రిజర్వ్
ఏపీ హైకోర్టులో కొనసాగిన విచారణ
AP High Court : అమరావతి – ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ సీఐడీ రిమాండ్ పొడిగించింది ఏపీ ఏసీబీ కోర్టు. ఇదిలా ఉండగా తాజాగా ఏపీ హైకోర్టులో అంగళ్లు కేసు విచారణ జరిగింది.
AP High Court Comment
వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేసింది కోర్టు. పుంగనూరు అల్లర్ల కేసులో ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా దేవినేని ఉమా , ఏ3గా అమర్నాథ్ రెడ్డి పేర్లు ఉన్నాయి. పుంగనూరు అల్లర్ల కేసులో చంద్రబాబు ప్రసంగం పూర్తిగా అల్లర్లను ప్రభావితం చేసేలా ఉందని వాదనలు వినిపించారు ఏపీ సీఐడీ న్యాయవాదులు.
ఇదిలా ఉండగా 45 ఏళ్ల రాజకీయ చరిత్ర, అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) పదే పదే షాక్ లు తగులుతున్నాయి. మరో వైపు ఏపీలో అమరావతి ఇన్నర్ రోడ్డు అలైన్మెంట్ స్కాం కేసులో ఏ14గా చేర్చింది ఏపీ సీఐడీ బాబు తనయుడు నారా లోకేష్ ను.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీలో అడుగు పెట్టిన వెంటనే అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఒకనాడు చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అన్ని వైపులా ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
Also Read : MLC Kavitha : గీత దాటిన గవర్నర్ – కవిత