AP High Court : ఏపీ సీఐడీ విచారణ 10కి వాయిదా
లోకేష్ కు హైకోర్టు భారీ ఊరట
AP High Court : అమరావతి – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు భారీ ఊరట లభించింది. ఆయనపై ఏపీ సీఐడీ విచారణ చేపట్టేందుకు అనుమతి నిరాకరించింది కోర్టు. సీఐడీ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది కోర్టు.
ఈ మేరకు ఏపీ(AP) సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు(AP High Court). సీఐడీ ఇచ్చిన 41ఎ నోటీసు లోని నిబంధనలను హైకోర్టులో సవాలు చేశారు నారా లోకేష్ తరపు లాయర్లు. లోకేష్ ఇచ్చిన లంచ్ మోషన్ పిటిషన్ పై కోర్టు విచారించింది.
AP High Court Decision
లోకేష్ హెరిటేజ్ లో షేర్ హోల్డర్ అని తెలిపారు. ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని చెప్పారు. లోకేష్ ను ఇవి అడగటం సమంజసం కాదని సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు అన్నారు.
తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, రేపే విచారణకు హాజరు కావాలని కోరారు సీఐడీ తరపు న్యాయవాదులు. అంత తొందర ఏముందంటూ ప్రశ్నించారు లోకేష్ న్యాయవాది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ కేసు 10కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది కోర్టు. కాగా 10న 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ చేపట్టాలని ఆదేశించింది.
Also Read : Nara Lokesh : నారా లోకేష్ కు కోర్టు ఊరట