AP High Court Shock : హైకోర్టులో బాబుకు చుక్కెదురు
ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత
AP High Court Shock : అమరావతి – టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ తగిలింది. మూడు కేసులు ఆయనపై ఏపీ సీఐడీ నమోదు చేసింది. వాటిలో ఒకటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైనమ్మెంట్ లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇందులో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని పేర్కొంది.
AP High Court Shock to Chandrababu
మరో కేసు ఫైబర్ నెట్ స్కాం. ఈ కేసులో ఆనాడు సీఎంగా ఉన్న సమయంలో తీవ్రమైన ఒత్తిడి తీసుకు వచ్చారని, ఈ కేసులో కూడా మనీ లాండరింగ్ చోటు చేసుకుందని ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసింది. ఇక రాష్ట్రంలో ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అంగళ్లుకు వెళ్లారు. ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ప్రజలను రెచ్చగొట్టారు.
ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసేందుకు కారణమయ్యారు. అంతే కాదు రెచ్చగొట్టేలా ప్రసంగించారు. దీని వల్ల శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగింది. అంతే కాదు టీడీపీ శ్రేణులు వాహనాలపై దాడులు చేశారు. ఆపై దగ్ధం చేశారు. మరోవైపు పోలీసులపై కూడా దాడి చేయబోయారు.
ఈ మూడింటిపై ఏపీ సీఐడీ సీరియస్ గా కేసులు నమోదు చేసింది. ఇప్పటికే ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులోనే ఉన్నారు. గత నెల 9న అరెస్ట్ అయ్యారు. ఇవాల్టితో 31 రోజులు గడిచాయి.
Also Read : Congress Tickets : కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ
