AP High Court: కప్పట్రాళ్ల హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు !

కప్పట్రాళ్ల హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు !

AP High Court: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామ ఫ్యాక్షన్‌ గొడవల్లో 11 మంది హత్యకు కారణమై జీవితఖైదు పడిన దోషులను.. నేడు నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితులకు ఆదోని కోర్టు విధించిన జీవిత కారాగార శిక్షను రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు(AP High Court) న్యాయమూర్తులు జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి, జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది.

AP High Court Orders

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన పాలెగారి వెంకటప్పనాయుడు, మాదాపురం మద్దిలేటినాయుడి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్‌ గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో 2008 మే 17న వెంకటప్పనాయుడితో పాటు మరో 10 మందిని వాహనాలతో ఢీకొట్టి, బాంబులు విసిరి వేటకొడవళ్లతో అత్యంత దారుణంగా హత్య చేశారనే ఆరోపణలతో మద్దిలేటినాయుడు సహా మరికొందరిపై అప్పట్లో దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యానేరం నిరూపణ కావడంతో కర్నూలు జిల్లా ఆదోని రెండో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు 17 మందికి జీవితకాలం కఠిన కారాగార శిక్ష విధిస్తూ 2014 డిసెంబరు 10న తీర్పు ఇచ్చింది.

వివిధ సెక్షన్ల కింద మరికొందరినీ దోషులుగా ప్రకటించింది. ఆదోని కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దోషులు అప్పట్లో హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం ఇటీవల తీర్పును వాయిదా వేసింది. అప్పీలుదారులను నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ప్రద్యూమ్నకుమార్‌రెడ్డి, పి.వీరారెడ్డి, న్యాయవాదులు కైలాసనాథరెడ్డి, డి.కోదండరామిరెడ్డి, చల్లా అజయ్‌కుమార్‌ తదితరులు వాదనలు వినిపించారు. నేర నిరూపణకు పోలీసులు కోర్టు ముందుంచిన సాక్ష్యాధారాలు నమ్మశక్యంగా లేవని వివరించారు.

Also Read : IAS Rajamouli: ఏపీకి డిప్యూటేషన్ పై ఐఏఎస్‌ రాజమౌళి !

Leave A Reply

Your Email Id will not be published!