AP TOP : రహదారుల నిర్మాణంలో ఏపీ టాప్
జాతీయ రహదారుల సంస్థ వెల్లడి
AP TOP : సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం అరుదైన ఘనత సాధించింది. 2022-23 లో జాతీయ రహదారుల నిర్మాణంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది(AP TOP). ఈ విషయాన్ని జాతీయ రహదారుల అభివృద్ది సంస్థ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. దేశంలో ఆ ఏడాదిలో మొత్తం 6,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 845 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించడం జరిగిందని పేర్కొంది.
ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం పై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. 50,793 మంది గూడు లేని నిరుపేదలకు వసతి సౌకర్యం కల్పించారు ఏపీ సీఎం. ఇదిలా ఉండగా వెంకట పాలెంలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. నరకాసురుడిని అయినా నమ్మవచ్చు కానీ నారా చంద్రబాబు నాయుడిని మాత్రం నమ్మ కూడదన్నారు.
తాము అభివృద్ది పనులతో ముందుకు వెళుతుంటే టీడీపీ, జనసేన అడ్డుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా జాతీయ రహదారుల నిర్మాణంలో తమ రాష్ట్రం టాప్ లో నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా అభివృద్ది అన్నది రాష్ట్రంలో ఆగదన్నారు. రహదారుల నిర్మాణం వల్ల అభివృద్దికి సోపానంగా మారుతుందన్నారు ఏపీ సీఎం జగన్ రెడ్డి.
Also Read : Haryana CM Boycott