Adimulapu Suresh : మంత్రి సురేష్ కు అరుదైన గుర్తింపు
ఢిల్లీ ఐఈటీఈ ఫెలోగా ఎన్నిక
Adimulapu Suresh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆదిమూలపు సురేష్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని ఐఈటీఈ ఫెలోగా ఎన్నికయ్యారు మంత్రి. ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు.
సురేష్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ (ఐఈటీఈ) ప్రతిష్టాత్మక ఫెలోగా ఎన్నికయ్యారు. ఈ సంస్థకు సంబంధించిన ప్రధాన ఆఫీసు దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఎలక్ట్రానిక్స్ , టెలికమ్యూనికేషన్స్ , ఐటీ సెక్టార్ సైన్స్ , టెక్నాలజీకి సంబంధించి అంకితమైన ప్రముఖ సంస్థలలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.
ఇదిలా ఉండగా ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh) గతంలో కర్ణాటక లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు ఆయన భారతీయ రైల్వేలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా పని చేశారు. దివంగత నాయకుడు, ఏపీ ఉమ్మడి సీఎంగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
పూర్తి స్థాయి పాలిటిక్స్ లోకి జంప్ అయ్యారు. ఓ వైపు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ ఇంకో వైపు తనకు ఇష్టమైన చదువుపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఆదిమూలపు సురేష్. ఇంజనీరింగ్ లో పరిశోధన చేశారు. ఇందుకు సంబంధించి పీహెచ్ డి పట్టా అందుకున్నారు మంత్రి.
2010లో అనంతపురం జేఎన్టీయూ నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఐఈటీఈ సంస్థ దేశ విదేశాల్లోని 63 కేంద్రాల ద్వారా 1.25 లక్షలకు పైగా నిపుణులు సేవలు అందిస్తుండడం విశేషం.
Also Read : 14న రాజీవ్ స్వగృహ ఆస్తుల వేలం