AP Pensions : ఏపీలో పెన్షన్ల పంపిణీ జాతర
11.61 లక్షల మందికి రూ. 319.46 కోట్లు
AP Pensions : ఆంధ్రప్రదేశ్ – ఏపీ సర్కార్ చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan) ఆదేశాల మేరకు అక్టోబర్ 1నే ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు జమ చేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న వాలంటీర్లు ఇవాళ తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రతి నెలా 65 లక్షల 78 వేల మందికి పెన్షన్లు ప్రతి నెలా ఒకటవ తేదీన పంపిణీ చేస్తున్నారు.
AP Pensions Update
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పెన్షనర్లకు రూ. 1813.60 కోట్లు విడుదల చేసింది. దశల వారీగా లబ్దిదారుల ఖాతాలలో జమ చేస్తూ వస్తోంది. ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో 11 లక్షల 61 వేల మందికి రూ. 319.46 కోట్లు జమ చేశారు వాలంటీర్లు.
ఏపీ సీఎం జగన్ రెడ్డి పేదల పాలిట దైవంగా మారారు. ఆయన బడుగు, బలహీన, నిమ్న వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు అన్నార్థులకు ఆసరాగా మారాయి.
Also Read : Chandra Babu Naidu : 2న చంద్రబాబు నిరాహార దీక్ష