AP Police : ఏపీలో భద్రత కట్టుదిట్టం
చలో రాజమండ్రి కి నో ఛాన్స్
AP Police : ఆంధ్ర ప్రదేశ్ – ఏపీ స్కిల్ స్కాంలో అడ్డంగా బుక్కై రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఐటీ ఎంప్లాయిస్ చలో రాజమండ్రి పేరుతో పిలుపునిచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించింది ఏపీ పోలీస్.
అడుగడుగునా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తున్నా కూడా తమను అడ్డుకుంటున్నారంటూ ప్రయాణీకులు వాపోతున్నారు. మరో వైపు తమకు మద్దతు తెలపడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించింది టీడీపీ.
AP Police Viral
ఇదే విషయాన్ని నారా లోకేష్(Nara Lokesh) ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. సైకో జగన్ వ్యవహారం దారుణమన్నారు. తాము భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బాబు అరెస్ట్ చేయడాన్ని చూసి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భయాందోళనకు గురవుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనేనని పేర్కొన్నారు. పనిగట్టుకుని తమ తండ్రిని జైలులో పెట్టారంటూ ఆరోపించారు నారా లోకేష్. ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కాం కేసులో రూ. 371 కోట్లు అవినీతి జరిగిందని దీనికి కర్త, కర్మ , క్రియ అంతా నారా చంద్రబాబు నాయుడే నని ఆరోపించింది ఏపీ సీఐడీ స్కీం. ఏసీబీ కోర్టులో హాజరు పర్చగా కస్టడీకి ఇచ్చారు.
Also Read : Nara Brahmani : నారా బ్రాహ్మణికి సంఘీభావం