AP Regional Pass Port Office : ఏపీలో ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీస్
వెల్లడించిన పాస్ పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష
AP Regional Pass Port Office : ఆంధ్రప్రదేశ్ – ఏపీ(AP) రాష్ట్రానికి తీపి కబురు చెప్పారు పాస్ట్ పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష. విజయవాడ కేంద్రంగా త్వరలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని వెల్లడించారు.
AP Regional Pass Port Office Updates
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా బందర్ రోడ్డులో రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు శివ హర్ష. భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ప్రతి రోజుకు ఏకంగా 2 వేలకు పైగా అప్లికేషన్స్ అందుతున్నాయని పేర్కొన్నారు పాస్ పోర్ట్ ఆఫీసర్.
కరోనా ఎఫెక్ట్ తర్వాత భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని స్పష్టం చేశారు. అక్టోబర్ నెల వరకు 3 లక్షల వరకు పాస్ పోర్ట్ లు జారీ చేసినట్లు శివ హర్ష చెప్పారు. పోస్టల్, పోలీసు శాఖల భాగస్వామ్యంతో పాస్ పోర్ట్ లను త్వరగా అందజేసేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
మరో కీలక అప్ డేట్ ఇచ్చారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ కేంద్రంగా ఇక పై పాస్ పోర్ట్ ప్రింటింగ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఇక్కడ కార్యాలయం గనుక స్టార్ట్ అయితే త్వరగా సేవలు అంచే ఛాన్స్ ఉంటుందన్నారు శివ హర్ష.
Also Read : Yanamala Ramakrishnudu : ఏపీ అప్పుల లెక్కలు తేల్చండి