AP RTC Buses Bandh : బాబు అరెస్ట్ బస్సులు బంద్
డిపోలకే పరిమితమైన బస్సులు
AP RTC Buses Bandh : ఆంధ్రప్రదేశ్ – ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో మాజీ సీఎం నారా చంద్రబాబును నంద్యాలలో శనివారం ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ బస్సులు నిలిపి వేశారు. టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలకు దిగుతుండడంతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బస్సులు నిలిపి వేసినట్లు ప్రకటించారు.
AP RTC Buses Bandh Viral
దీంతో ఏపీలోని పలు చోట్ల బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. చాలా చోట్ల డిపోలకే బస్సులు పరిమితం అయ్యాయి. మరో వైపు స్కీం స్కామ్ కు సంబంధించి విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఆయన తనయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరో వైపు ఈ కేసులో నారా చంద్రబాబు నాయుడుతో పాటు తనయుడు నారా లోకేష్ కు కూడా పాత్ర ఉన్నట్టు తేలిందని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్(CID Chief Sanjay) సంచలన ప్రకటన చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లడారు. లోకేష్ పాత్ర కూడా ఉన్నట్టు తేలిందన్నారు.
ఆర్థిక కుట్రకు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఈడీ, జీఎస్టీ కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయని స్పష్టం చేశారు.
Also Read : Daggubati Purandewari : బాబు అరెస్ట్ అప్రజాస్వామికం