AP Schools Reopening: ఏపీలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ పొడిగింపు !

ఏపీలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ పొడిగింపు !

AP Schools Reopening: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో జూన్ 12న తెరచుకోవాల్సిన పాఠశాలలు… జూన్‌13న పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

AP Schools Reopening..

సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా… ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : Fish Medicine Distribution: ముగిసిన చేప ప్రసాదం పంపిణీ !

Leave A Reply

Your Email Id will not be published!