AP Skill Scam Case : బాబు బెయిల్ పిటిషన్ 17కు వాయిదా
నారా చంద్రబాబు నాయుడుకు షాక్
AP Skill Scam Case : అమరావతి – ఏపీ స్కిల్ స్కాం కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది. ఈనెల 17 వరకు వాయిదా వేసింది అమరావతి హైకోర్టు. ఈ కేసుకు సంబంధించి ఇరువురి తరపున వాదనలు వినిపించారు.
AP Skill Scam Case Status
ఏపీ సీఐడీ, సర్కార్ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు లో పేరు పొందిన లాయర్లు వాదించారు. ఇరువురి వాదనలు విన్నది హైకోర్టు. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కు సంబంధించి కేసు ఈనెల 17కి వాయిదా వేసినట్లు కోర్టు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఏపీ స్కిల్ స్కాం కేసులో విచారణ చేపట్టిన ఏపీ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. అక్టోబర్ 19 వరకు రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని కొట్టి వేసింది. దీనిని సవాల్ చేస్తూ తిరిగి ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడుపై మొత్తం మూడు స్కాంలకు సంబంధించి కేసులు నమోదు చేసింది ఏపీ సీఐడీ. ఏపీ స్కిల్ స్కాంతో పాటు ఫైబర్ నెట్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలు ఉన్నాయి.
Also Read : BRS Manifesto : బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కేసీఆర్ ఫోకస్