CM Jagan Global Summit : రూ. 30 లక్షల కోట్ల ప్రతిపాదనలు – జగన్
6 లక్షల మందికి ఉపాధి
CM Jagan Global Summit : ఏపీ రాష్ట్రానికి రూ. 13 లక్షల కోట్ల విలువైన 340 ప్రతిపాదనలు అందాయని సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వైజాగ్ వేదికగా గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం(CM Jagan Global Summit) ప్రసంగించారు. ఈ ప్రతిపాదనల వల్ల 6 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ ప్రతిపాదనలు 20 రంగాలకు సంబంధించినవి ఉన్నాయని చెప్పారు సీఎం.
ఇవాళ 11 లక్షల కోట్లతో 92 ఎంఓయూలను అమలు చేస్తామన్నారు. మిగిలినవి రేపు జరుగుతాయని తెలిపారు సీఎం. రాష్ట్రం అందించే అవకాశాలు, ఆరోగ్య కరమైన పోటీ, దీర్ఘకాలిక భాగస్వామ్యానికి దాని ప్రాధాన్యతను గుర్తించాలన్నారు జగన్ రెడ్డి.
మోడీ నేతృత్వంలోని భారత దేశం జి20కి నాయకత్వం తమకు నిర్ణయాత్మకమన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాలలో ఏపీ ఒకటి అని పేర్కొన్నారు సీఎం. విదేశీ, దేశీయ ప్రత్యక్ష పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా ఉందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతంతో సమృద్దిగా సహజ వనరులను కలిగి ఉందని స్పష్టం చేశారు జగన్ రెడ్డి(CM Jagan).
ఏపీలో అభివృద్ది చెందిన ఓడ రేవులతో పాటు 6 ఎయిర్ పోర్టులు, 3 పారిశ్రామిక కారిడార్లు , వ్యూహాత్మక ప్రదేశం, నైపుణ్యం కలిగిన యువత , విధాన పరమైన ఫ్రేమ్ వర్క్ తో చురుకైన ప్రభుత్వం ఇక్కడ కొలువు తీరిందన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్దిలో మీరంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా విశాఖ పట్టణం కార్యనిర్వాహక రాజధానిగా ఉందన్నారు సీఎం.
Also Read : దేశ పురోభివృద్దిలో ఏపీ కీలకం – అంబానీ