Mukesh Ambani : దేశ పురోభివృద్దిలో ఏపీ కీలకం – అంబానీ
వైజాగ్ సమ్మిట్ లో రిలయన్స్ చైర్మన్
Mukesh Ambani AP : దేశ అభివృద్దిలో , పునర్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకమైన పాత్ర పోషించనుందని కితాబు ఇచ్చారు రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముకేష్ అంబానీ. శుక్రవారం విశాఖపట్టణంలో జరిగిన సమ్మిట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమ్మిట్ లో తాను భాగం పంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు అంబానీ(Mukesh Ambani AP). ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
ఇలాంటివి నిర్వహించడం వల్ల ఎంతో మేలు చేస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకు రావాలనే లక్ష్యంగా జగన్ రెడ్డి జీఐఎస్ 2023 పేరుతో సమ్మిట్ ఏర్పాటు చేశారు. దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలను , ఔత్సాహికులను ఇక్కడికి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ కంపెనీల చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు, జిందాల్ గ్రూప్ సంస్థల చైర్మన్ జిందాల్ , తో పాటు దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యారు.
ప్రస్తుతం వైజాగ్ కోలాహలంగా మారి పోయింది. పలు రంగాలలో ఏపీ నెంబర్ వన్ గా మారుతోందని ఇది తనకు ఎంతగానో సంతోషం కలిగిస్తోందని చెప్పారు ముకేష్ అంబానీ. ఏపీలో కీలక రంగాలలో అపారమైన వనరులు ఉన్నాయని గుర్తు చేశారు. వీటిని వినియోగించుకుంటే ఏపీ కీలకమైన రాష్ట్రంగా దేశంలో ఎదిగేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు రిలయన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(Mukesh Ambani).
ప్రస్తుతం టెక్నాలజీలో సంచలనంగా 5జీ మారిందన్నారు రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్. రాష్ట్రంలో 5జీ నెట్ వర్క్ 90 శాతం కవర్ చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read : మోదీ ప్రియమైన నాయకుడు – మెలోనీ