Buggana Rajendranath Reddy : జీఎస్టీలో ఏపీ టాప్ – బుగ్గ‌న

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి వెల్ల‌డి

Buggana Rajendranath Reddy : దేశంలో రాష్ట్రాల వారీగా గ‌ణంకాలు చూస్తే జీఎస్టీ విభాగంలో సీఎం సందంటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైసీపీ ప్ర‌భుత్వం టాప్ లో ఉంద‌ని ఆ రాష్ట్ర ఆర్థిక‌, వాణిజ్య ప‌న్నుల శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. టీడీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేశారంటూ ఆరోపించారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై నారా చంద్ర‌బాబు నాయుడు, మాజీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నోరు పారేసు కోవ‌డం త‌గ‌ద‌న్నారు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి.

ఒక వేళ త‌గ‌దున‌మ్మా అని అనుకుంటే స్ప‌ష్టత రావాల‌ని అనుకుంటే చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు ఏపీ మంత్రి. ప‌థ‌కాలు ఇస్తే ఉచితాలు అంటున్నారు. మ‌రి టీడీపీ ఇస్తున్న హామీలు ఉచితాలు కాక మరేమిటంటూ ప్రశ్నించారు. చిల్లర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy).

తాము ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఇస్తామంటూ ఓట్ల రాజ‌కీయం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. పాల‌న రాద‌ని ఎద్దేవా చేశార‌ని, కానీ ఇవాళ త‌మ పాల‌న‌కు నిద‌ర్శ‌నం జీఎస్టీలో నెంబ‌ర్ వ‌న్ స్టేట్ గా నిల‌వ‌డం అని పేర్కొన్నారు ఏపీ ఆర్థిక మంత్రి. గ‌తంలో కంటే ఎక్కువ‌గా ర‌హ‌దారుల నిర్మాణం , అభివృద్ది చేయ‌డం జ‌రిగింద‌న్నారు. క‌రోనా క‌ష్ట కాలంలో సైతం ఏపీ త‌ట్టుకుని నిల‌బ‌డింద‌న్నారు.

Also Read : PM Modi : యోగాతో ఆరోగ్యం ఆనందం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!