AP DIG Ravi Kiran : బాబు ములాఖత్ పై ఆంక్షలు
ఏపీ డీజీపీ రవి కిరణ్ తో భేటీ
AP DIG Ravi Kiran : రాజమండ్రి – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనతో ములాఖత్ కావాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు బాబు ఫ్యామిలీకి చెందిన నారా భువనేశ్వరి , కోడలు నారా బ్రాహ్మణి, కొడుకు నారా లోకేష్ బాబుతో పాటు ఏపీ పీఏసీ చైర్మన్ , ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ , ఏపీ టీడీపీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు కలుస్తూ వచ్చారు.
AP DIG Ravi Kiran Asking Prior Intimation to meet Chandrababu
కోర్టు ఆదేశాల మేరకు లాయర్ సమక్షంలో చంద్రబాబుతో మాట్లాడాలని, ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయించిన మేరకు ఏపీ డీఐజీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం టీడీపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో టీం జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ తో భేటీ అయ్యారు. ములాఖత్ పై కోతలు పెడుతున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు(Chandrababu) అనారోగ్యం దృష్ట్యా కుటుంబ సభ్యులు కలవాల్సి ఉందని పేర్కొన్నారు.
కోర్టుల్లో వివిధ దశల్లో కేసులు కొనసాగుతుండడం వల్ల తాము ఆయన హెల్త్ పై తీవ్ర ఆందోళన చెందుతున్నామని స్పష్టం చేశారు. ములాఖత్ కు సంబంధించి వెసులుబాటు ఇవ్వాలని కోరారు.
Also Read : Chandra Babu Case : చంద్రబాబు కేసు విచారణ వాయిదా