AP TET 2024: ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల !

ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల !

AP TET 2024: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు కు సంబంధించి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం అనగా పరీక్ష షెడ్యూల్, సిలబస్, అర్హత వివరాలు, ఆన్ లైన్ టెస్ట్ నిర్వహణ షెడ్యూల్, ప్రాథమిక కీ, కీపై అభ్యంతరాల స్వీకరణ, ఫైనల్ కీ మరియు టెట్ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏపీ విద్యాశాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కమీషనర్ పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలియజేసారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఆన్ లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసారు. ఈ టెట్ 2024కు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు.

AP TET 2024 Notification..

టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోనికి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సీపై పెట్టారు. సుమారులో 16వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో డిఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహణఖు నోటిఫికేషన్ జారీ చేసారు. డీఎస్సీలో టెట్ కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

Also Read : Minister Ramprasad Reddy: మంత్రి భార్య దురుసు ప్రవర్తనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ !

Leave A Reply

Your Email Id will not be published!