Peddasesha Vahanam : పెద్దశేష వాహనంపై శ్రీనివాసుడు
అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు
Peddasesha Vahanam : ప్రముఖ పుణ్య క్షేత్రమైన అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్ద శేష వాహనంపై(Peddasesha Vahanam) శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వైకుంఠ నాథుడి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతాయి. తిరుచానూరు అమ్మ వారు, తిరుపతి పట్టణంలో కొలువు తీరిన శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయాలు కొలువు తీరి ఉన్నాయి. వేలాదిగా తరలి వచ్చే భక్తులకు స్వామి, అమ్మవార్లు దర్శనం ఇస్తారు.
సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తమ కోరిన కోర్కెలు తీర్చే దైవంగా అప్పలాయగుంటలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని భావిస్తారు. ప్రత్యేకించి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం నిలిచింది. చుట్టు పక్కల గుట్టలు, కొండల మధ్య అప్పలాయగుంట ఉంది. చెన్నైకి వెళ్లే రహదారికి పక్కనే ఈ పుణ్య క్షేత్రం కొలువై ఉంది. తాజాగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తోంది. బస్సు, వాహనాల సౌకర్యం ఈ క్షేత్రానికి ఉంది.
Also Read : Mega Farmers Meet
