Apple & Google Shock : గూగుల్ వార్నింగ్ ఆపిల్ బిగ్ షాక్

దిగ్గ‌జ కంపెనీలో ఉద్యోగులకు ఝ‌ల‌క్

Apple & Google Shock : టెక్ దిగ్గ‌జ కంపెనీలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. త‌మ సంస్థ‌ల‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను ఇంటికి పంపించే ప‌నిలో ప‌డ్డాయి. ఇప్ప‌టికే గూగుల్ సిఇఓ సుంద‌ర్ పిచాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్నారంటూ మిగ‌తా వాళ్లు ప‌నిపై ఫోక‌స్ పెట్ట‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ త‌రుణంలో ఉన్న వారికి చెక్ పెడుతూ కొత్త‌గా గూగుల్(Google) నుంచి తీసుకునేది లేదంటూ సూత్ర ప్రాయంగా హెచ్చ‌రించారు.

ఇక తానేమీ తీసిపోనంటూ మ‌రో అమెరిక‌న్ కంపెనీ ఆపిల్ కంపెనీ (Apple) బిగ్ షాక్ ఇచ్చింది ఉద్యోగుల‌కు. ఇదిలా ఉండ‌గా కంపెనీలో కొత్త ఉద్యోగుల‌ను నియ‌మించేందుకు బాధ్య‌త వ‌హించే సుమారు 100 మంది కాంట్రాక్ట్ ఆధారిత రిక్రూట్ ల‌ను ఆపిల్ తొల‌గించింది.

ఈ విష‌యాన్ని ఇవాళ అధికారికంగా ప్ర‌క‌టించింది. గూగుల్ ఇప్ప‌టికే బ్ల‌డ్ ఇన్ ది స్ట్రీట్స్ అంటూ షాక్ ఇచ్చారు సుంద‌ర్ పిచాయ్. కాగా పూర్తి స‌మ‌యం ఉద్యోగులుగా ఉన్న రిక్రూట్ల‌ను మాత్రం తొల‌గించ‌లేదంటూ స్ప‌ష్టం చేసింది ఆపిల్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో.

ఒక ర‌కంగా చెప్పాలంటే కొత్త‌గా దిగ్గ‌జ సంస్థ‌లలో ప‌ని చేయాల‌ని అనుకునే వారికి కోలుకోలేని షాక్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. కాంట్రాక్టులు ర‌ద్ద‌యిన కార్మికుల‌కు రెండు వారాల పాటు చెల్లింపులు, వైద్య ప్ర‌యోజ‌నాలు అందుతాయ‌ని తెలిపింది.

కాగా కంపెనీ ప్ర‌స్తుత ఆర్థిక అవ‌స‌రాల దృష్ట్యా కోత‌లు విధించిన‌ట్లు యాపిల్ స్ప‌ష్టం చేసింది. కంపెనీ భ‌విష్య‌త్ కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు సిఇఓ టిమ్ కుక్.

Also Read : ఏటీఎంలో మ‌నీ డ్రాపై ఛార్జీల మోత

Leave A Reply

Your Email Id will not be published!