Amit Shah : కశ్మీర్ లో రిజర్వేషన్ కోటా వర్తింపు
త్వరలోనే అమలు చేస్తామన్న షా
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన ప్రకటన చేశారు. కశ్మీర్ లో కోటాను అమలు చేస్తామని డిక్లేర్ చేశారు. జమ్మూ కశ్మీర్ లోని రాజౌరిలో ర్యాలీతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కేంద్ర హొం శాఖ మంత్రి.
రాష్ట్రంలో గుజ్జర్లు, బకర్వాల్ లతో పాటు పహారీ సామాజిక వర్గాలకు కూడా త్వరలో విద్యా, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) గా రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు అమిత్ చంద్ర షా. రాజౌరిలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో కేంద్ర హొం మంత్రి పాల్గొని ప్రసంగించారు.
ఎస్టీ హోదాను పొందినట్లయితే భారత దేశంలో భాషా పరమైన సమూహం రిజర్వేషన్లను సంపాదించిన మొదటిది అవుతుందని వెల్లడించారు. ఇది అమలు అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాల్సి ఉంటుందన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమీషన్ నివేదికను పంపించిందన్నారు అమిత్ చంద్ర షా(Amit Shah). గుజ్జర్ , బకర్వాల్ , పహారీ వర్గాలకు రిజర్వేషన్లను సిఫార్సు చేసిందని వెల్లడించారు.
తాము ముందస్తుగా ప్రకటించిన విధంగానే రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పారు కేంద్ర హొం శాఖ మంత్రి. గతలో తాము ప్రకటించిన విధంగానే ఈసారి ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు అమిత్ షా.
ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాతే అలాంటి రిజర్వేషన్ సాధ్యమైందన్నారు. దీనిని అమలు చేయడం వల్ల మైనార్టీలు, దళితులు, గిరిజనులు, పహారీలు తమ హక్కులను పొందుతారని చెప్పారు.
Also Read : హాట్ లైన్ లో చైనాకు వార్నింగ్ – చౌదరి