Bandi Sanjay : బండి సంజ‌య్ కి కీల‌క ప‌ద‌వి

జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా నియామ‌కం

Bandi Sanjay : భార‌తీయ జ‌న‌తా పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్న క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ను తొల‌గించింది. ఆయ‌న స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిష‌న్ రెడ్డికి ప‌ద‌విని అప్ప‌చెప్పింది. దీంతో బండి సంజ‌య్ ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆయ‌న ప‌ద‌వి తీసుకునేందుకు ఒప్పుకోలేద‌ని, కేవ‌లం కార్య‌క‌ర్త‌గా మాత్ర‌మే ఉండేందుకు స‌మ్మ‌తి తెలిపిన‌ట్లు టాక్.

ఇదే స‌మ‌యంలో బండిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘు నంద‌న్ రావు. ఒక‌ప్పుడు కార్పొరేటర్ గా ప‌ని చేసిన స‌మ‌యంలో భార్య పుస్తెలు అమ్మిన బండి సంజ‌య్(Bandi Sanjay) కుమార్ కు రూ.100 కోట్లు ఎలా వ‌చ్చాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఉన్న‌ట్టుండి బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఫోక‌స్ పెట్టింది. కీల‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది. తెలంగాణ‌తో పాటు ఏపీ, ఇత‌ర రాష్ట్రాల‌కు సంబంధించి రాష్ట్ర అధ్య‌క్షుల‌ను మార్చింది. పార్టీ చీఫ్ గా ప‌ద‌వి కోల్పోయి తీవ్ర నిరాశ‌కు గురైన బండి సంజ‌య్ ని బుజ్జ‌గించేందుకు పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గంలోకి తీసుకుంది. ఈ విష‌యాన్ని పార్టీ జాతీయ చీఫ్ జేపీ న‌డ్డా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

Also Read : TTD Cancels Break Darshan : 11న శ్రీ‌వారి బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

 

Leave A Reply

Your Email Id will not be published!