APSRTC Special Busses : ఎపీఎస్ఆర్టీసీ ఖుష్ కబర్
వడ్డింపు లేకుండానే జర్నీ
APSRTC Special Busses : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త సంవత్సరం వేళ శుభవార్త చెప్పింది. ఇప్పటికే సీఎం సపోర్ట్ తో ఆ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్రాంతి పండుగకు భారీ ఎత్తున రద్దీ ఉండడం ఖాయం. దీంతో ఇటు తెలంగాణ ఆర్టీసీ, అటు ఆంధప్రదేశ్ ఆర్టీసీ ప్రయాణీకులకు ఎలాంటి భారం పడకుండా ప్రయాణం చేసేలా చర్యలు చేపట్టింది.
గతంలో పండుగులు లేదా ఇతర వాటికి భారీ ఎత్తున అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు. దీంతో జర్నీ చేయాలంటే జడుసుకునే వారు ప్రయాణీకులు. దీంతో దీనిని గమనించిన ఏపీఎస్ఆర్టీసీ(APSRTC Special Busses) తీపికబురు చెప్పింది. సంక్రాంతి పండుగకు ఏకంగా ఈసారి 6,400 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించింది.
జనవరి 6 నుంచి 14వ తేదీ వరకు అంటే తొమ్మిది రోజుల పాటు 24 గంటల పాటు సర్వీసులు అందించనుంది. అంతే కాదు ప్రత్యేక రాయితీ కూడా ప్రయాణం చేసే వారికి కల్పించింది ఆర్టీసీ. అంతే కాకుండా పండుగను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ రద్దీ గనుక పెరిగితే ఆయా డిపోల నుంచి కూడా 15 నుంచి 18వ తేదీ వరకు అదనపు బస్సులు(APSRTC Special Busses) నడపాలని కూడా నిర్ణయించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.
ఇందులో భాగంగా రాను పోను ప్రయాణానికి సంబంధించి ఒకేసారి టికెట్లు గనుక బుక్ చేసుకుంటే వారికి మొత్తం ఛార్జీలలో 10 శాతం రాయితీ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా పండుగ ముందు 3,120 బస్సులు పండుగ తర్వాత 3,280 బస్సులు అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
గత ఏడాది కంటే ఈ సారి 63 నుంచి 68 శాతానికి పెరిగిందన్నారు ఎండీ ద్వారకా తిరుమలరావు. ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.
Also Read : తునీషాను వాడు చంపేశాడు – వనిత