Araga Jnanendra : కార్య‌క‌ర్త‌ల్లో ఆగ్ర‌హం సహ‌జం – జ్ఞానేంద్ర‌

దేశం కోసం ప్రాణాలు అర్పించారు

Araga Jnanendra : క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న బాధాక‌రం. అందుకే రాష్ట్ర ప్ర‌భుత్వం మూడేళ్ల వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మాల‌ను కూడా ర‌ద్దు చేసుకుంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు పాల్గొనాల్సిన ర్యాలీని కూడా ర‌ద్దు చేశామ‌న్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అర‌గ జ్ఞానేంద్ర‌(Araga Jnanendra).

ఈ ప‌రిస్థితుల్లో కార్య‌క‌ర్త‌లలో ఆవేశం, ఆగ్ర‌హం కల‌గ‌డం మామూలేన‌న్నారు. తాము వారి బాధ‌ను, భ‌యాందోళ‌న‌ల‌ను అర్థం చేసుకోగ‌ల‌మ‌న్నారు. అందుకే తాము సంయ‌మ‌నం పాటించాల‌ని కోరుతున్నామ‌ని చెప్పారు.

గురువారం జాతీయ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర హొం శాఖ మంత్రి. ప్రవీణ్ న‌ట్టారు మంచి మ‌నిషిగా పేరు తెచ్చుకున్నారు. బ‌తుకు దెరువు కోసం షాప్ నిర్వ‌హిస్తూ వ‌చ్చారు.

కానీ కొంద‌రు ప‌నిగట్టుకుని హ‌త్య‌కు పాల్ప‌డ‌డం దారుణ‌మ‌న్నారు మంత్రి. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వెంట‌నే దోషులు ఎవ‌రో ప‌ట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగార‌న్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితి గురించి ఆరా తీశామ‌న్నారు. సీఎం విచార‌ణ‌కు సైతం ఆదేశించార‌ని తెలిపారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లు, దాని అనుబంధ సంఘాల నాయ‌కులు, శ్రేణులు ఎవ‌రూ ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగ‌ర‌ని వారంతా సామ‌ర‌స్య పూర్వ‌క‌మైన వాతావ‌ర‌ణం కోరుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి అర‌గ జ్ఞానేంద్ర‌.

ఇది పూర్తిగా కంట త‌డి పెట్టించే అంశ‌మ‌న్నారు. బాధిత కుటుంబాన్ని ప్ర‌భుత్వం త‌ప్ప‌క ఆదుకుంటుంద‌న్నారు. ప్ర‌వీణ్ చేసిన సేవ‌లు ప్ర‌శంసనీయ‌మ‌ని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని, ఎస్పీ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని తెలిపారు మంత్రి. మొత్తంగా ఈ హ‌త్య‌తో మ‌రోసారి క‌ర్ణాట‌కలో క‌ల‌క‌లం రేగింది.

Also Read : స‌మ‌స్య‌ల‌పై నిల‌దీయ‌డం మా హ‌క్కు

Leave A Reply

Your Email Id will not be published!