Arjun Meghwal : బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ విఫలం
కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్
Arjun Meghwal : కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్(Arjun Meghwal) షాకింగ్ కామెంట్స్ చేశారు. పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతలు ఏమాత్రం సరిగా లేవన్నారు. తాను భావిస్తున్నట్లు చెప్పారు. అత్యంత దారుణంగా ఉందన్నారు. జనం బయటకు రావాలంటే భయపడుతున్నారని వాపోయారు. ఆయన తాజాగా న్యాయ శాఖ మంత్రిగా కొలువు తీరారు. ఈ సందర్బంగా బెంగాల్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేంద్రం కావాలని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర రాజధాని కోల్ కతాకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అధికారిక పర్యటనకు విచ్చేశారు. 12 మంది ప్రాణాలు కోల్పోయిన పుర్బా మేదినీపర్ జిల్లా లోని ఎగ్రా వద్ద పేలుడుతో సహా రాష్ట్రంలో ఇటీలవ జరిగిన కొన్ని సంఘటన గురించి మీడియా అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏమైనా ఉందా అన్న అనుమానం తనకు కలుగుతోందన్నారు.
మొత్తం వివరాలు తెలుసుకుంటానని ఆ తర్వాత ఏం చేయాలో చేస్తామన్నారు అర్జున్ మేఘ్వాల్. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య కీలక సమావేశం జరగనుంది. కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించారు. ఈ తరుణంలో మేఘ్వాల్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : Conrad Sangma